వారం రోజుల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా చేప పిల్లల పంపిణీ
NRPT: వారం రోజుల్లోగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం రాత్రి హైదరాబాదులోని తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చేప పిల్లల పంపిణీలో గత ప్రభుత్వం మాదిరిగా అక్రమాలు జరిగితే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు.