ఎస్సారెస్పీ కాలువకు గండి... వృథాగా పోతున్న నీరు

ఎస్సారెస్పీ కాలువకు గండి... వృథాగా పోతున్న నీరు

MHBD: ఇనుగుర్తి మండల శివారులోని మాసుకుంట తండా సమీపంలో ఎస్సారెస్పీ కాలువకు గండి పడింది. దీంతో పంట పొలాలకు అందించే సాగు నీరు వృధాగా పోతుంది. పంట పొలాలకు నీరు అందకపోతే పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి గండి పూడ్చాలని రైతులు కోరుతున్నారు.