కనకదుర్గ అమ్మవారి జాతరకి ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక
E.G: జగ్గంపేట మండలం జే కొత్తూరు గ్రామదేవత కనకదుర్గ అమ్మవారి 40వ జాతర మహోత్సవములకు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. డిసెంబర్ 6వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి అమ్మవారి ఆలయం వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జానపద నృత్య ప్రదర్శనలతో కనులు ఇందుగా జరుగుతుందన్నారు.