విసిసి మినీ బాలోత్సవం పోస్టర్ ఆవిష్కరణ
విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ‘విసిసి ఆసరా మినీ బాలోత్సవం’ పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఆసరా చారిటబుల్ సొసైటీ, వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 27న ఒక రోజు బాలోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.