లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం: ఎస్పీ

లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం: ఎస్పీ

VKB: కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. రాజీ మార్గమే రాజమార్గమని, పోరాడితే ఒక్కరే గెలుస్తారని, రాజీ కుదుర్చుకుంటే ఇద్దరూ గెలుస్తారని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.