సీసీటీవీ రిపేర్, సర్వీస్‌లో యుకులకు ఉచిత శిక్షణ

KRNL: కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు సీసీటీవీ రిపేర్, సర్వీస్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ కె.పుష్పక్ తెలిపారు. కోర్సుకు శిక్షణ సెప్టెంబర్ 12వ తేదీ నుంచి 13 రోజులపాటు ఇస్తామని తెలియజేశారు. 18-45 ఏళ్లలోపు వయసున్న యువకులు అర్హులని వివరించారు.