'బీఆర్ఎస్ నేతలు అబద్ధాలను చెబుతున్నారు'
సూర్యాపేటలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై ధ్వజమెత్తారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు అబద్ధాలను పదేపదే చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పోరాడుతున్నారని స్పష్టం చేశారు.