ప్రధానితో ఎంపీ కలిశెట్టి భేటీ

VZM: దేశ ప్రధాని నరేంద్ర మోడీతో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం భేటీ అయ్యారు. ఢిల్లీ పార్లమెంట్ హౌస్‌లో ఏపీకు చెందిన సహచర ఎంపీలతో మర్యాదపూర్వకంగా కలిసి పీఎంతో ఫోటో దిగారు. రాష్ట్ర అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నందుకు మోడీను కలిసి కృతజ్ఞతలు తెలిపామని ఎంపీ తెలిపారు. తనను మోడీ ఆప్యాయంగా పలకరించారని ఎంపీ చెప్పారు.