వడదెబ్బతో రైతు మృతి

వడదెబ్బతో రైతు మృతి

KMM: ఎండ తీవ్రత తాళలేక ఓ రైతు పొలంలోనే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఈ ఘటన కూసుమంచి మండలం గట్టుసింగారంలో చోటుచేసుకుంది. గ్రామాన్నికి  చెందిన భారీ చౌడయ్య (50) శుక్రవారం వ్యవసాయ పనుల నిమిత్తం తన పొలానికి వెళ్లారు. ఎండ దెబ్బకు ఆయన అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోగా, గమనించిన స్థానికులు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.