కూచిపూడి నృత్యంలో గిన్నిస్ రికార్డు

NRPT: కృషి, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నారాయణపేట పట్టణానికి చెందిన మానసవీణ కూచిపూడి నృత్యంలో ప్రతిభ కనబరిచింది. డిసెంబర్ 23న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూచిపూడి లార్జెస్ట్ డాన్స్ లెసన్ కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్ నుంచి ప్రశంస పత్రం అందుకుంది. కూచిపూడి నృత్యకళలో మానసవీణను అందరూ అభినందిస్తున్నారు.