దారుణం.. కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

దారుణం.. కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

రంగారెడ్డి: చేవెళ్ల మండలం దామరగిద్దలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న కారులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరి ఆడక మృతిచెందారు. అప్పటివరకు డోర్లు ఓపెన్ చేసి ఉండగా.. ఆడుకుంటూ ఆడుకుంటూ డోర్లు క్లోజ్ చేశారు. ఆ డోర్లు కాస్త లాక్ పడటంతో ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరై తన్మయశ్రీ(5), అభినయశ్రీ(4) మృతిచెందారు.