ఘోర అగ్నిప్రమాదం.. 53 మందికి గాయాలు
దక్షిణ కొరియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డెజియోన్ నగరంలోని వాహనాల విడిభాగాల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఫ్యాక్టరీలో పని చేస్తున్న 53 మంది గాయపడ్డారు. వీరిలో 24 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో 14 మంది ఆచూకీ తెలియరాలేదని అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.