జిల్లాలో 10 నుంచి 12 వరకు బాలోత్సవం పోటీలు
KMM: విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మంచికంటి హాల్లో బాలోత్సవం నిర్వహించనున్నట్లు కన్వీనింగ్ కమిటీ ప్రకటించింది. బ్రోచర్లు అందని పాఠశాలలు కూడా ఈ ప్రకటనను ఆహ్వానంగా భావించి, తమ విద్యార్థులను పంపవచ్చు. సబ్-జూనియర్ల నుంచి సీనియర్ల వరకు స్టోరీ టెల్లింగ్, డ్రాయింగ్, నృత్యం వంటి పలు విభాగాల్లో పోటీలు ఉంటాయి.