వనపర్తి రేంజ్‌లో వేలం

వనపర్తి రేంజ్, ఘణపురం రేంజ్ పరిధిలో 2025 సంవత్సరానికి సీతాఫల్, బొంత కాకరకాయ సేకరించుటకు ఆగస్టు 20వ తేదీన ఉదయం 11 గంటలకు వేలం వెయ్యనున్నట్లు అటవీ శాఖ అధికారి ప్రసాద్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల పాటదారులపై వేలంలో ఐదు వేలు ధరావత్తు చెల్లించి వేలం పాటలో పాల్గొనాలన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా అటవీశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.