'డబుల్ బెడ్ రూమ్‌ల కేటాయింపుకై దరఖాస్తు చేసుకోవాలి'
MNCL: బెల్లంపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్‌ల కేటాయింపు కోసం అర్హత కలిగి, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలని MRO కృష్ణ ప్రకటనలో తెలిపారు. బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన అర్హులు మీసేవ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, మొబైల్ నంబర్‌తో ఈనెల 16 వరకు అప్లై చేయాలన్నారు.