నేడే పురపాలిక ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక
RR: ఇబ్రహీంపట్నం పురపాలిక ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక ఇవాళ మ.12.30 గంటలకు జరగనుంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పురపాలిక ఎన్నికల్లో మొత్తం 24 వార్డులకు BRS 13, కాంగ్రెస్ 8, BJP నుంచి ఇద్దరు, ఒక స్వతంత్ర అభ్యర్థి కౌన్సిలర్ స్థానాలు గెలిపొందిన విషయం తెలిసిందే. అప్పుడు ఛైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికపై కోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నిక వాయిదా పడింది.