డయాలసిస్ కేంద్ర ఏర్పాట్లు పరిశీలించిన DMHO

డయాలసిస్ కేంద్ర ఏర్పాట్లు పరిశీలించిన DMHO

KNR: జమ్మికుంట సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు కానున్న డయాలసిస్ కేంద్ర ఏర్పాట్లను DMHO డాక్టర్ వెంకట రమణ పరిశీలించారు. డీసీహెచ్ కృష్ణ ప్రసాద్, డిప్యూటీ DMHO డాక్టర్ శ్రవణ్ కుమార్తో కలిసి పడకలు, గదులు, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు. కిడ్నీ రోగులు దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ కేంద్రంలో చికిత్స పొందవచ్చని ఆయన తెలిపారు.