రెబ్బెనలో అడిషనల్ కలెక్టర్ పర్యటన

ASF: రెబ్బెన మండలంలో సోమవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ తివారి పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మండల కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్‌లో ఇండ్లలోకి నీరు చేరింది. విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ సోమవారం పర్యటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమస్య పరిష్కరానికి కృషి చేస్తామని అన్నారు. అడిషనల్ కలెక్టర్‌తో డీపీఓ, ఎంపీడీఓ, ఎమ్మార్వో ఉన్నారు.