900 గోల్స్ క్లబ్‌లోకి మెస్సీ

900 గోల్స్ క్లబ్‌లోకి మెస్సీ

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ తన కెరీర్‌లో 900 గోల్స్ మైలురాయిని అందుకుని చరిత్ర సృష్టించాడు. నాష్‌విల్లేతో జరిగిన మ్యాచ్‌లో ఇంటర్ మియామి తరఫున మెస్సీ ఈ ఘనత సాధించాడు. క్రిస్టియానో రొనాల్డో తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్‌గా మెస్సీ నిలిచాడు. రొనాల్డో కంటే 94 మ్యాచ్‌లు తక్కువలోనే మెస్సీ ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు.