రేపు పట్టణంలో పవర్ కట్

రేపు పట్టణంలో పవర్ కట్

కోనసీమ: మండపేట పట్టణంలో శనివారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. 33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని లైన్, సబ్ స్టేషన్ మరమ్మతు పనులు, చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుందని ఎలక్ట్రికల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. మల్లికా తెలిపారు.