ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ..!

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ..!

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని బొమ్మూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల మేత లోడుతో వెలుతున్న లారీ బ్రేక్ ఫెయిల్ అయి బోల్తా పడి, రహదారి పక్కన ఉన్న ఓ ఇంటిలోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.