మహిళా పీఎస్ సీఐగా రామానుజులు బాధ్యతలు

మహిళా పీఎస్ సీఐగా రామానుజులు బాధ్యతలు

కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా రామానుజులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను కలిశారు.. శాంతిభద్రతలు, నేర నియంత్రణకు కృషి చేస్తానని సీఐ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమర్థంగా విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు.