VIDEO: మానిటరింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు
NGKL: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు భీమా నాయక్, రాజ్యలక్ష్మి సోమవారం పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు వివిధ దినపత్రికలలో వచ్చిన వార్తలపై వారు ఆరా తీశారు. అన్ని విషయాలు రికార్డులలో రాయాలని అధికారులకు సూచించారు.