GHMC పరిధిలో నమోదైన వర్షపాతం వివరాలు ఇవే
MDCL: GHMC పరిధిలో ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా 5.3 మిల్లీమీటర్ల వర్షపాతం కాప్రా GHMC కార్యాలయంలో నమోదైంది. షేక్ పేట్ గౌతమ్‌నగర్ ఫంక్షన్ హాల్ వద్ద 4.5 మి.మీ, బాలానగర్ ఓల్డ్ సుల్తాన్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు TGDPS తెలిపింది. రేపు సైతం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది.