VIDEO: వడ్లతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రం
KMR: బిచ్కుందకు చెందిన చిత్రకారుడు బాస బాల్ కిషన్, సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం సుమారు రెండు గంటలు శ్రమించి వడ్లను ఉపయోగించి సీఎం రేవంత్ రెడ్డి చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు. ఈ కళాఖండాన్ని చూసిన పలువురు ఆశ్చర్యపోయి కిషన్ సృజనాత్మకతను, కృషిని అభినందించారు.