బీరప్ప కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: వేములవాడ రూరల్ మండలం నమిలిగుండపల్లి, బాలరాజుపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న శ్రీ బీరప్ప కామరతి స్వామివార్ల కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్, ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలరాజుపల్లి గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు.