మధ్యాహ్న భోజనంపై కలెక్టర్ ఆగ్రహం
SDPT: గజ్వేల్ మండలం అకారం హైస్కూల్‌ను ఇవాళ కలెక్టర్ హైమావతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మధ్యాహ్న భోజనంను పరిశీలించారు. మెనూ ప్రకారం వండిన బగారా అన్నం చూసి రోజు ఇలానే విద్యార్థులకు పెడుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బగారా అన్నం ఎలా చేస్తారో తెలియదా అంటూ హెచ్ఎం, ఫుడ్ చెకింగ్ టీచర్ పై మండిపడ్డారు.