VIDEO: ఐసీయూలో చికిత్స పొందుతున్న పసికందు
సత్యసాయి: సోమందేపల్లి మండలం నడింపల్లిలో అప్పుడే పుట్టిన పసికందును శనివారం చెత్త కుప్పలో పడేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ పసికందు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు శిశువును ఐసీయూలో చేర్చి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వైద్యులు శిశువును మగ బిడ్డగా గుర్తించి, ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.