ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
GDWL: ఒక్కరోజు ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తులో అధికారులుగా మారాలని హెచ్ఎం మల్లికార్జున్ అన్నారు. బుధవారం రాజోలి మండల కేంద్రంలోని న్యూ ఫ్లాట్స్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరిగింది. డీఈఓగా పుష్ప, ఎంఈఓగా మహేంద్ర, హెచ్ఎంగా సందీప్, మిగతా విద్యార్థులు టీచర్లుగా మారారు.