జిల్లాలో నిండినవి 10% చెరువులే

మెదక్ జిల్లాలో ఇప్పటివరకు కేవలం 10 శాతం చెరువులు మాత్రమే అలుగు పారుతున్నాయి. ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు తెలపిన వివరాలు.. జిల్లాలో మొత్తం 2,632 చెరువులున్నాయని, ఇందులో 25% 661, 50% 556, 75% 593, 100% 564 నిండాయన్నారు. అలుగులు పారుతున్నవి 258 చెరువులే అని వివరించారు. మెదక్ ప్రాంతంలో ఇంకా వర్షం కురవాల్సిన అవసరం ఉందన్నారు.