చెర్లోపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే కాకర్ల
NLR: ఉదయగిరి మండలం జి. చెర్లోపల్లి పంచాయతీలో గురువారం జరిగిన గ్రామ కమిటీ సమావేశంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, గ్రామాలభివృద్ధికి పార్టీలకతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.