పెద్దిరెడ్డి ఇంటివద్ద టెన్షన్.. టెన్షన్

AP: మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటిదగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. బుగ్గ మఠానికి చెందిన 14.49 ఎకరాల భూములపై సర్వే జరుగుతోంది. బుగ్గ మఠం భూములు ఆక్రమించారన్న ఆరోపణలు ఉండటంతో.. ఏప్రిల్ 11న పెద్దిరెడ్డికి దేవదాయశాఖ నోటీసులు ఇచ్చింది. సర్వే సమయంలో పెద్దిరెడ్డి అనుచరులు మఠం అధికారులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.