ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం
అనకాపల్లి రామచంద్ర థియేటర్ జంక్షన్‌లో శనివారం వైసీపీ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు జానకిరామరాజు, పార్టీ యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్ మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు త్యాగం ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం అవతరించిందన్నారు.