కాల్పుల్లో గాయపడిన అన్సారీకి 14 రోజుల రిమాండ్

కాల్పుల్లో గాయపడిన అన్సారీకి 14 రోజుల రిమాండ్

HYD: చాదర్‌ఘాట్‌లో గల విక్టోరియా ప్లే గ్రౌండ్‌లో గత శనివారం కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిందితుడు ఒమర్ అన్సారి కోలుకోవడంతో శనివారం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించడంతో అతడిని చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు.