'యుద్ధ ప్రాతిపదికన వ్యవసాయ సర్వీసులు మంజూరు'
SRCL:,యుద్ధ ప్రాతిపదికన వ్యవసాయ సర్వీసులు మంజూరు చేస్తున్నట్టు సిరిసిల్ల జిల్లా సూపర్డెంట్ బిక్షపతి తెలిపారు. సిరిసిల్లలో ఆదివారం ఆయన మాట్లాడారు. కేవలం 5 రోజుల్లోనే 240 సర్వీసులు మంజూరు చేసామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 1400 సర్వీసులు మాత్రమే ఉన్నాయన్నారు. రైతులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేశారు.