'పురుగు మందు తాగి రైతు మృతి'

CTR: పీటీఎం మండలంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. రంగసముద్రానికి చెందిన ఆర్.కుమార్(45) స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి వద్ద ఐదు లక్షల రూపాయలకు చిట్టీలు వేసి ఆ డబ్బులు చెల్లించలేక పోయాడు. ఈ క్రమంలో ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, కుటుంబీకులు గమనించి చికిత్స కోసం బి.కొత్తకోటకు తరలించారు. మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.