పత్తి రైతుకు తప్పని తిప్పలు
ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి రైతులకు తేమ తిప్పలు తప్పడం లేదు. సీసీఐ తేమ శాతం 12లోపు ఉంటేనే పత్తి పంటను కొనుగోలు చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి వాతావరణం మార్పుల కారణంగా పత్తిలో తేమశాతం పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మార్కెట్ యార్డులో నిన్నటి నుంచి పత్తి పంట ఎండ బెట్టుకుని వేచి చూస్తున్నామన్నారు.