జీలుగా, జనుము సాగుతో భూసారం: వ్యవసాయ అధికారి గోవింద్

MDK: జీలుగా, జనుము సాగుతో భూసారం పెరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ పేర్కొన్నారు. శుక్రవారం పాపన్నపేట మండలంలో పంటలు పరిశీలించారు. జీలుగా సాగుతో ప్రధాన పంటకు ముందస్తుగా నేలను తయారు చేస్తుందన్నారు. జీలుగ సాగుతో మూడు టన్నుల పచ్చిరొట్ట ఎరువు లభిస్తుంది. మొక్కలకు 2 శాతం నత్రజని, సూపర్ పాస్ పేట్ను అదనంగా అందిస్తాయన్నారు.