గ్రానైట్ గుట్టలు కరుగుతున్నాయి: కవిత

గ్రానైట్ గుట్టలు కరుగుతున్నాయి: కవిత

TG: రైతులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తుఫాన్ వల్ల కరీంనగర్ జిల్లాలో నష్టపోయిన రైతులను పరామర్శించిన కవిత.. కరీంనగర్‌లో గ్రానైట్ గుట్టలు కరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.