రేపు మంత్రి పర్యటన వివరాలు ఇలా..
KMM: పాలేరు నియోజకవర్గంలో ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి పీఏ ఓ ప్రకటనలో తెలిపారు. జల్లేపల్లి (కూసుమంచి), ఆరెగూడెం (నేలకొండపల్లి), ఏదులాపురం మున్సిపాలిటీలో పర్యటించి తుఫాన్ కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం ఖమ్మం రూరల్ (మం) కామంచికల్ లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.