పాలిసెట్ పరీక్షలు.. సెంటర్లు ఇవే.!
KDP: ప్రొద్దుటూరు డివిజన్‌లో 2636 మంది విద్యార్థులు పాలిసెట్ పరీక్షలు రాస్తున్నారు. CBITలో 394 మంది, YSR ఇంజినీరింగ్ కాలేజీలో 389, SKSC కాలేజీలో 400, YVS మున్సిపల్ బాలికల పాఠశాలలో 360, ఆదిత్య హైస్కూల్లో 384, SRITలో 409, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో 300 మంది పరీక్షలు రాస్తున్నట్లు ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ గురుమూర్తి రెడ్డి తెలిపారు.