ఆలయాల్లో కార్తీక శోభ

ఆలయాల్లో కార్తీక శోభ

TG: కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నీలకంఠేశ్వరుడి ఆలయాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. నల్గొండ చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామి, దేవరకొండ మార్కండేయస్వామి, పచ్చల ఛాయ సోమేశ్వరాలయం, నాగర్ కర్నూల్ బుగ్గ రామేశ్వరస్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.