రిజర్వాయర్ నుంచి నీటి విడుదల
SRCL: కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ నుంచి వెంకట్రావుపేట గిద్ద చెరువులోకి నీటిని మంగళవారం కోనరావుపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ పొలాలకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను గ్రామస్తులు కోరగా.. ఆయన ఆదేశాల మేరకు వ్యవసాయ సాగుకు నీటిని విడుదల చేశారు.