'డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్'

'డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్'

VZM: డిసెంబర్ 13వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.భబిత తెలిపారు. ఈమేరకు జిల్లా కోర్ట్‌లో బుధవారం విజయనగరం, మన్యం జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజీ కాదగ్గ అన్ని క్రిమినల్ కేసులను గుర్తించి, స్పెషల్ డ్రైవ్ చేపట్టి వాటిని పరిష్కరించాలని సూచించారు.