ఈనెల 3న బాలబాలికలకు ఫుట్ బాల్ ఎంపిక పోటీలు

మంచిర్యాల: జిల్లా పులిమడుగులోని హెవెన్ ఆఫ్ హోప్ హైస్కూల్‌లో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 3న అండర్-14, 17 బాలబాలికలకు ఫుట్ బాల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు DEO యాదయ్య, SGF కార్యదర్శి యాకూబ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు టోర్నమెంట్ నిర్వాహక కార్యదర్శి సురేందర్ ను 85198 78452 నంబర్ లో సంప్రదించాలని తెలిపారు.