'ప్రజలు అప్రమత్తంగా ఉండండి'

'ప్రజలు అప్రమత్తంగా ఉండండి'

KMR: మండలం మద్నూర్ గ్రామ శివారులో చిరుతపులి సంచారంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి సుజాత ఈ విషయంపై స్పందిస్తూ, గురువారం రాత్రి చిరుత ప్రజలకు కనిపించిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ సిబ్బంది మరింత పరిశీలన జరిపి, నిర్ధారణకు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆమె తెలిపారు.