ప్రజావాణిలో 143 దరఖాస్తులు
SRCL: ప్రజావాణిలో 143 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.