ఇస్త్రీ చేస్తూ ప్రచారం చేసిన మంత్రి
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వెంగళ్ రావు నగర్ డివిజన్ పరిధిలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని స్థానికులను కోరారు. అనంతరం డివిజన్‌లోని ఓ షాపులో ఇస్త్రీ చేస్తూ ప్రచారం చేశారు.