VIDEO: హిందూపురంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా

VIDEO: హిందూపురంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా

సత్యసాయి: హిందూపురంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు. రహమత్పూర్ సర్కిల్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రిటైర్డ్ అయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.