ఏపీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగాచేసిన ఎమ్మెల్యే

Akp: చదువు చెప్పడంతోపాటు విద్యార్థుల నడవడికను ఉపాధ్యాయులు నిరంతరం పరిశీలించాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సూచించారు. అచ్యుతాపురం ఏపీ గురుకుల పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుడి అవతారం ఎత్తి విద్యార్థులకు పాఠాలు బోధించి వారికి పలు ప్రశ్నలు వేశారు. పిల్లలకు, ఉపాధ్యాయులు మధ్య మంచి సంబందాలు ఉండాలన్నారు.